Site icon Bhakthi TV

సుచీంద్రంలో ఒకే శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని సుచీంద్రంలో వెలిసిన ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడే త్రిమూర్తులు ఒకే లింగరూపంలో వెలిశారు. ఒకే శివలింగంలో త్రిమూర్తులు ఉండటమనేది చాలా ఆసక్తికరం. అయితే శివలింగం పై భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు. మధ్యభాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడు. కింద భాగంలో బ్రహ్మదేవుడు వెలిశాడు. ఈ త్రిమూర్తులకు సంబంధించి ఒక ఆసక్తికర కథ కూడా ఉంది. అదేంటో తెలుసుకుంది.

గౌతమ మహర్షి భార్య అహల్య అందినకి ముగ్దుడైన ఇంద్రుడు ఆమెను ఎలాగైన సొంతం చేసుకోవాలనుకున్నాడు. గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఆయన మాదిరిగానే తన రూపాన్ని మార్చి ఇంద్రుడు అహల్య దగ్గరకు వెళ్లాడు. వీరిద్దరూ సరససల్లాపాల్లో ఉండగా.. గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అహల్యను రాయిగా మారిపొమ్మని.. అలాగే ఇంద్రుడిని సైతం శపిస్తాడు. శాపవిమోచనం కోసం ఇంద్రుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా ఫలితం దక్కలేదట. చివరకు సుచీంద్రంలో త్రిమూర్తుల శివలింగాన్ని ప్రతిష్టించి సేవించిన తరువాత శాప విమోచనం పొందాడని ఆలయ స్థల పురాణం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version