Site icon Bhakthi TV

మార్చిలో శ్రీవారి ఆలయంలో ఏమేం విశేష ఉత్సవాలు ఉన్నాయంటే..

మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో ప్రతి నెలలోనూ విశేష ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే మార్చిలోనూ జరుగుతాయి. మార్చిలో 7వ తేదీ నుంచి విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర జరుగనుంది. అలాగే ఈ నెలలోనే శ్రీవారి తెప్పోత్సవాలు, ఉగాది పండుగ కుమారతీర్థ ముక్కోటి వంటివి ఉన్నాయి.

మార్చి నెలలో విశేష ఉత్సవాలు..

మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
⁠9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
10న మతత్రయ ఏకాదశి.
13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి.
14న కుమారధారతీర్థ ముక్కోటి.
⁠25న సర్వ ఏకాదశి.
⁠26న అన్నమాచార్య వర్థంతి.
⁠28న మాస శివరాత్రి.
29న సర్వ అమావాస్య.
⁠30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.

Share this post with your friends
Exit mobile version