Site icon Bhakthi TV

టీటీడీ కల్యాణ వేదికలో వివాహం చేసుకొనుటకు రూల్స్ ఏంటంటే..

తిరుమలలోని కల్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఏమేం కావాలి? ఎలా బుక్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుుడ తిరుమలలో వివాహం చేసుకునేందుకు రూల్స్ ఏంటో తెలుసుకుందాం. కరెంటు బుకింగ్ / ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. ద్వితీయ వివాహములు, ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఆధార్ కార్డులను అప్‌లోడ్ చేయాలి. ఇతర వివరాలకు ఫోన్ – 0877 – 2263433 సంప్రదించవచ్చు.

వివాహ రిజిస్ట్రేషన్ కోసం ఏం చేయాలంటే..

తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు, తమ వివాహన్ని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ”హిందూ వివాహ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం నూతన వధూవరులు తమ వయస్సు ధృవ పత్రములు, నివాస ధృవ పత్రము, వివాహము ఫోటో, పెళ్లి పత్రిక, కళ్యాణ మండపము రసీదు పత్రాలను, వీటితో పాటు అవివాహితులుగా (అన్ మ్యారీడ్) ఉన్నట్లు స్థానిక ఎమ్మార్వో నుంచి ధృవీకరణ పత్రాలను కల్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి. ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ – 0877 – 2263433 సంప్రదించవచ్చు. తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

Share this post with your friends
Exit mobile version