Site icon Bhakthi TV

ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం: టీటీడీ

ఓ వ్యక్తి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్‌లో హల్‌చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది వారించినా వినకుండా నానా హంగామా చేశాడు. వల్లూరి వంశీనాధ్ రెడ్డి అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనానికి వచ్చాడు. వస్తూ వస్తూ తనతో స్పెషల్ ఫోటోగ్రాఫర్లను వెంట తీసుకొచ్చాడు. శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం ముందు ఫోటో షూట్ చేస్తూ హల్ చల్ చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే నిన్న సదరు వ్యక్తి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీ వేంకటేశ్వ స్వామివారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన నలుగురు ఫోటోగ్రాఫర్లతో ఫోటో షూట్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటో షూట్ చేయకూడదని వారించి అక్కడ నుండి పంపి వేసి తమ విధుల్లోకి వెళ్లడం జరిగింది. వారు వెళ్లిన అనంతరమే తిరిగి సదరు వ్యక్తి మరల తిరిగివచ్చి ఫోటో షూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం జరిగింది. ఈ కారణంగా వల్లూరి వంశీనాధ్ రెడ్డిపై టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.

Share this post with your friends
Exit mobile version