Site icon Bhakthi TV

వేద విద్య దినదినాభివృద్ధి చెందాలి: అహోబిల మఠాధిపతి

వేద విద్య దినదినాభివృద్ధి చెందాలని అహోబిల మఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అన్నారు. తిరుమలలో ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని ఆయన ఆదివారం ఉదయం సందర్శించి విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేద విద్యాభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తాను కూడా వేద విజ్ఞాన పీఠం పూర్వ విద్యార్థినే అని గుర్తు చేసుకున్నారు. వేద విద్యా విధానం అమలుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి 17 వేదాలను ఆయన పఠించారు. ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, వేద, ఆగమ పండితులు పాల్గొన్నారు.

మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం..

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 12,320 కిలోల బియ్యం వేలానికి సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందవచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి. ఇతర వివరాలకు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్‌ కార్యాలయాన్ని ఫోన్ నెంబర్ 0877-2264429, సదరు నంబర్ తో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

Share this post with your friends
Exit mobile version