Site icon Bhakthi TV

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.

శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి.లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు.ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇక తిరుమలలో భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా ఇంజినీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు నాలుగు మాఢ వీధుల్లోనూ వైట్ కూల్ పెయింట్ వేశారు.

Share this post with your friends
Exit mobile version