Site icon Bhakthi TV

ఇకపై తిరుమలకు వచ్చేవారు ఈ విషయం తెలుసుకుని తీరాల్సిందే..

తిరుమలకు వచ్చేవారు ఇకపై తప్పనిసరిగా ఓ విషయాన్ని మైండ్‌లో పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా కొందరు సొంత వెహికిల్‌పై లేదంటే ఒక వెహికిల్‌ను మాట్లాడుకుని వస్తారు. వారు తప్పినసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే… వెహికిల్‌కు ఫాస్ట్ టాగ్ ఉందా.. లేదా? అని చెక్ చేసుకోవాలి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీకు నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది.

ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి తిరుమలకు రావాలనుకునేవారు తప్పనిసరిగా తాము వచ్చే వెహికిల్‌కు ఫాస్ట్ టాగ్ ఉందా.. లేదా? అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version