Site icon Bhakthi TV

వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..

తిరుమలలో పది రోజుల పాటు నిర్వహించిన వైకుంఠ దర్శనాలు పూర్తయ్యాయి. జనవరి 3వ తేది శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శనమయ్యాయి. అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం. ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు. భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి 44 లక్షల లడ్డూలను విక్రయించడం జరిగింది.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించినట్టు టీటీడీ వెల్లడించింది.

ఇక వైకుంఠ ద్వార దర్శనాల్లో దాదాపు 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. వివిధ విభాగాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. తిరుమల, తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలా 400 ప్రచార బోర్డులు ఏర్పాటు చేశారు. రేడియో బ్రాడ్ కాస్టింగ్ ద్వారా 5 భాషల్లో వైకుంఠ ద్వార దర్శనాలపై అవగాహన కల్పించారు. తిరుమలలో టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో నీటి కొరత లేకుండా నిరంతరాయం భక్తులకు నీటి సరఫరా చేశారు.

Share this post with your friends
Exit mobile version