Site icon Bhakthi TV

25న శ్రీ తాళ్లపాక అన్నమయ్య 522వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 522వ వ‌ర్థంతి ఉత్సవాలు మార్చి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 29వ తేదీ వరకూ జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 25వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

అనంతరం మార్చి 26న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు. మార్చి 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం తగిన ఏర్పాట్లు నిర్వహిస్తోంది.

Share this post with your friends
Exit mobile version