Site icon Bhakthi TV

జూన్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

ప్రతి నెలలోనూ తిరుమలలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన వివరాలను ప్రతి నెలా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తూ ఉంటుంది. తిరుమలలో జూన్ నెలలో పెద్దగా విశేష పర్వదినాలు ఏమీ లేవు. ఇతర నెలలతో పోలిస్తే జూన్ నెలలో విశేష పర్వదినాలు చాలా తక్కువ. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం.
జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌.
జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం.
జూన్ 21 స్మార్త ఏకాద‌శి.
జూన్ 22న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి.
⁠జూన్ 26న పెరియాళ్వార్ ఉత్స‌వారంభం.

Share this post with your friends
Exit mobile version