Site icon Bhakthi TV

అన్నప్రసాదం, లడ్డూ నాణ్యతకు ప్రాధాన్యం

గత జూన్ నుంచి టీటీడీలో అన్నప్రసాదం, శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవలలో పారదర్శకత, దర్శన టిక్కెట్లు, వసతి, దళారులను కట్టడిచేయడం, టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టీటీడీ ఐటీ విభాగంలో అనర్హుని ఐటీ జీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు.

అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రీయ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో, దాతలు రూ.5 కోట్ల విలువైన కల్తీ సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేశారన్నారు. దీంతో దాదాపు రూ.25 కోట్ల వరకు దాతలకు టీటీడీలో పలు ప్రివిలేజేస్ కల్పిస్తూ పాస్ పుస్తకాల ప్రయోజనాన్ని పొందేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి విరాళాలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకున్నా ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు. ఇలాంటి అక్రమాలను తాము రద్దు చేశామని ఈవో మీడియా ముందు చెప్పారు. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.

Share this post with your friends
Exit mobile version