Site icon Bhakthi TV

రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం

తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి అన్నప్రసాదంతో పాటు వివిధ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విష‌యం విదిత‌మే.

ప్ర‌స్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల‌ వివ‌రాలు

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ ప్రకటించిన ప్రకారం.. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు) దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.

Share this post with your friends
Exit mobile version