Site icon Bhakthi TV

తిరుమల మ్యూజియాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురండి..

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను శనివారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జేఈవో(విద్య&ఆరోగ్యం) శ్రీమతి గౌతమితో కలిసి తనిఖీ చేశారు. ముందుగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో గో సంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి గోశాల కార్యాకలాపాల పై వివరంగా పీపీటీ ఇచ్చారు. మొత్తం ఐదు గోశాలలోని పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్, నెయ్యి ట్యాంకర్లు, గుడికో గోమాత వంటి కార్యాకలాపాలను ఈవో సమీక్షించారు.

అనంతరం ఎస్వీ గోశాలకు చేరుకుని నెయ్యి ప్లాంటు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, దాణా మిక్సింగ్ యూనిట్, అగరబత్తిల యూనిట్ లో చేపట్టిన ప్రోజెక్టులను పరిశీలించి నాణ్యత మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Share this post with your friends
Exit mobile version