
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తమకు తోచిన విధంగా నగదు రూపానో.. మరొక రూపానో కానుకలు సమర్పిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. అ కొప్పెర వారి పల్లికి చెందిన శ్రీ కామినేని శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు కుప్పెర హుండీని బహుకరించారు. శ్రీవారి ఆలయం ముందు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత కొప్పెర హుండీని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,625 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,462 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
