Site icon Bhakthi TV

తిరుమలలో వీఐపీ దర్శనాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మీదట ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాల పరిమితిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇక మీదట ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై రోజుకు రెండు వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. చంద్రబాబును ఈ విషయమై పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యర్థించగా ఆయన ఓకే చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు ప్రభనుత్వం నుంచి కానీ.. ఇటు టీటీడీ నుంచి కానీ ఎలాంటి స్పందనా లేదు.

23న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు సీల్డ్ టెండ‌ర్ల‌ను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళీ టిన్‌లు 2025 మార్చి 31వ తేదీ వ‌ర‌కు సేక‌రించ‌వ‌చ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు అక్టోబరు 23వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయ‌వ‌లెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

Share this post with your friends
Exit mobile version