Site icon Bhakthi TV

తిరుమలలో భారీగా పెరిగిన లడ్డూ నిల్వలు..

తిరుమలలో లడ్డు విక్రయంపై తిరుమల తిరుపతి దేవస్థానం.. రెండు మూడు రోజుల్లో రకరకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. ఒకసారి ఒక్కో భక్తుడికి ఒక లడ్డు మాత్రమేనని ప్రకటించింది. మరో రోజు ఆధార్ ఉంటేనే లడ్డూ ఇస్తామని ప్రకటించింది. ఇక తాజాగా మాత్రం భక్తుడి ఎన్ని లడ్డూలు అవసరమైతే అన్ని అందజేస్తామని తెలిపింది. అయితే అదనంగా ఇచ్చే లడ్డూలపై ఒక్కో దానికి రూ.50 చొప్పున వసూలు చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇంతకు ముందు కూడా ఇదే రీతిలో లడ్డూలను విక్రయిస్తూ ఉండేది కాబట్టి సమస్యేమీ లేదు. అయితే తిరుమలలో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లు పూర్తిగా పాడయ్యాయి. వందల సంఖ్యలో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దీంతో తిరుమలకు వెళ్లే వారంతా ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే లడ్డు విక్రయాల్లో నూతన విధానం అమలులోకి రావడంతో పాటు మూడు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో భారీగా లడ్డు నిల్వలు పెరిగాయి. లడ్డు స్టాక్ భారీగా పెరగడంతో.. దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు కోరినన్ని లడ్డూలను టీటీడీ ఇస్తోంది. లడ్డు నిల్వలు భారీగా పెరగడంతో తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో సైతం లడ్డూ విక్రయాలను టీటీడీ చేపట్టింది.

Share this post with your friends
Exit mobile version