Site icon Bhakthi TV

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు ఏమేం ఉన్నాయో తెలుసా?

తిరుమ‌లలో ప్రతి నెలలోనూ విశేష పర్వదినాలుంటాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో పర్వదినాల విశేషాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇప్పటికే శ్రీవారి అనుబంధ ఆలయాలకు సంబంధించి ఏప్రిల్ నెలలో చేపట్టనున్న పర్వదినాల విశేషాలను ప్రకటించడం జరిగింది. తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలను సైతం ఆలయ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో 6 నుంచే విశేష పర్వదినాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

– ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.
– ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
– ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
– ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
– ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
– ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
– ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
– ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.

Share this post with your friends
Exit mobile version