Site icon Bhakthi TV

డిసెంబరు 28న ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’

తిరుమల సందర్శించే భక్తులకు ఏవో ఒక సమస్యలు తలెత్తుతుంటాయి. లేదంటే ఏదైనా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనిపిస్తుంది. అదీకాదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైనా సూచన చేయాలనిపిస్తుంది. అయితే ఎలా తెలియజేయాలనే విషయం మాత్రం తెలియదు. అలాంటి వారందరికీ సదవకాశం టీటీడీ ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మం ద్వారా వస్తూ ఉంటుంది. వీలైనప్పుడల్లా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటారు. భక్తులు తమ సలహాలు, సందేహాలకు కావల్సిన టీటీడీ ఈవో సమాధానాలు చెబుతారు.

డిసెంబరు 28వ తేదీన టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. 28వ తేదీన ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

Share this post with your friends
Exit mobile version