Site icon Bhakthi TV

టీటీడీ భారీ విరాళం అందజేసిన చెన్నై దాత

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. ఎస్వీబీసీ, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్‌లకు ఆ విరాళాన్ని అందజేశాడు. చెన్నైకి చెందిన దాత శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం రూ. కోటి విలువైన డిడిలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీ వర్ధమాన్ జైన్ ఇలా విరాళం అందించడం తొలిసారేమీ కాదు. గతంలోనూ టీటీడీ ట్రస్టులకుఅనేక మార్లు విరాళంగా అందజేశారు.

కాగా.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. నిన్న క్యూలైన్లను టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కొందరు భక్తులు తిరుమల శ్రీవారిని నేరుగా దర్శించుకునే అవకాశం ఉందా? అని కోరారు. సోమవారం తిరుమలలోని క్యూలైన్లలోకి నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్న సమాచారం ఉందా అని ఈవో భక్తులను అడుగారు. అలాగే ఎప్పటికప్పుడు విష్ణు నివాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారంపై ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. అలాగే సోమవారం రోజున తిరుమల క్యూలైన్లులోకి నేరుగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చనే సమాచారాన్ని సైతం భక్తులకు నిరంతరం చేరవేసేలా మైకులు ద్వారా ప్రకటనలు ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు.

Share this post with your friends
Exit mobile version