Site icon Bhakthi TV

టీటీడీకి కెమెరా, రూ.10.11 లక్షలు విరాళం

నెల్లూరుకు చెందిన వంశీరామ్ బిల్డర్స్ అధినేత శ్రీ వంశీరామ్ సుబ్బారెడ్డి మంగళవారం నాడు, రూ.8.84 లక్షలు విలువైన కెనాన్ డిజిటల్ మిర్రర్ లెస్ కెమెరా, లెన్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు. దాత తరపున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవోకు కెమెరా, లెన్సులను అందజేశారు.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన శ్రీ గౌరవ్ ఐరెన్ అనే భక్తుడు మంగళవారం శ్రీవేంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.10,11,111/- విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

నేడు అన్నమయ్య 522వ వర్థంతి

పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 522వ వర్థంతి మహోత్సవాన్ని మార్చి 26న తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.

Share this post with your friends
Exit mobile version