Site icon Bhakthi TV

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. 28, 30, 31లలో హుండీ కానుకల వేలం..

తిరుమల శ్రీవారికి నిత్యం నగదు, బంగారం, వెండితో పాటు పలు వస్తువులను కానుకగా భక్తులు సమర్పిస్తుంటారు. వాటిలో కెమెరాలు, కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను వేలం వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తేదీలను ఫిక్స్ చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 06 లాట్లు ఆగష్టు 28వ తేదీన టెండర్ కమ్ వేలం జరుగనుందని టీటీడీ తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించాలని కోరింది.

తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను ఆగస్ట్ 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నారు. ఇందులో కాపర్ – 2 (3000కేజిలు) -15 లాట్లు ఆగష్టు 30న, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (2,400 కేజిలు) -12 లాట్లు ఆగష్టు 31వ తేదీ వేలానికి ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించాలని టీటీడీ సూచించింది.

Share this post with your friends
Exit mobile version