Site icon Bhakthi TV

టీటీడీకి విరాళంగా మరో కియోస్క్ యంత్రం

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి సైతం ఓ కియోస్క్ యంత్రం విరాళంగా అందింది. శుక్రవారం ఉదయం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపిఐ మోడ్ లో రూ.లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించగా తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనంలో అందుబాటులో ఉండగా, ఈరోజు ఇచ్చిన మిషన్‌ను తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉపయోగంలోకి రానుంది.

కియోస్క్ మిషన్‌లను తిరుమల అన్నదానం, పద్మావతీ గెస్ట్ హౌస్, సీఆర్వో ఆఫీస్ , దేవుని కడప, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటిమిట్ట, శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చెన్నై , బెంగళూరు, విజయవాడలలో టీటీడీ వినియోగిస్తోంది. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు శ్రీ ఏ.వి.నిరంజన్, శ్రీ ఆర్.వెంకటరావు, శ్రీ డి.అశోక్ వర్థన్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఐటీ డిజీఎం శ్రీ బి.వేంకటేశ్వర్లు, ఏఈవో శ్రీ బి. రవి, సూపరింటెండెంట్ శ్రీ డి. ముని శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version