Site icon Bhakthi TV

తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు

తిరుమలలోని హెచ్.టి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్.టి.షాపింగ్ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ భగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదనప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 29వ తేది తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం జరగనుంది. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version