Site icon Bhakthi TV

జూలై 2026 మాసఫలం

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం): వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభకాలం నడుస్తోంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలను చేరుతారు. వివిధ రకాలుగా ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. కీలక వ్యవహారాల్లో మొహమాటం పక్కన పెట్టండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శత్రువులపై విజయం కలుగుతుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. పూర్వ పుణ్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఇష్టదేవతా స్మరణ చేయండి.

వృషభం (కృత్తిక 2-4, రోహిణి, మృగశిర 1-2 పాదాలు): కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుతుచి ముందడుగు వేయండి. ముఖ్యమైన పనిలో ఆర్థిక సాయం అందుతుంది. అయితే అనుకున్న పనులు పూర్తిచేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కొంత లాభించినా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపై తప్పక శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురుశ్లోకం పఠించండి. ఇష్టదేవతా దర్శనం చేయడం ఉత్తమం.

జూలై 2026 మాసఫలం

మిథునం (మృగశిర 3-4, ఆర్ద్ర, పునర్వసు 1-3 పాదాలు): మీ మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేయండి. ఇంటా బయటా శాంతియుత వాతావరణం నెలకొంటుంది. దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. సమయపాలనకు అత్యంత ప్రాధాన్యతనివ్వండి. ఆరోగ్యంపై అశ్రద్ధ విడిచి పెట్టవద్దు. కుటుంబసభ్యుల సలహాలను విస్మరించవద్దు. ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అదనపు ఖర్చులుంటాయి. వెంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు): గ్రహపరంగా సామాన్య ప్రయోజనాలు. పట్టుదలతో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేయకండి. శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా శుభకాలమైనా ఖర్చులు కూడా ఉంటాయి. లౌక్యంతో సమస్యలను అధిగమిస్తారు. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరితోనూ వాదోపవాదాలు వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సూర్యనారాయణ స్వామి స్మరణ శుభప్రదంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం): మిశ్రమకాలం నడుస్తోంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో ఎదుర్కొంటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. అకారణ కలహ సూచనలు ఉండవచ్చు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ప్రయాణాలు అధికం. క్రయవిక్రయాల్లో తొందరపాటు వద్దు. నవగ్రహ ధ్యానం ప్రతినిత్యం చేయండి.

కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు): అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరించండి. అదృష్టయోగం వరిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు. నిరుద్యోగులకు కాలం కలిసివస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లక్ష్మీధ్యానం శుభఫలితాలనిస్తుంది.

తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు): మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. ఓర్పు చాలా అవసరం. కొన్ని వార్తలు బాధను కలిగించవచ్చు. అనారోగ్య సమస్యలు చిరాకు పరచవచ్చు. సమయానికి విశ్రాంతి అవసరం. కుటుంబసభ్యుల్లో సామరస్యత ఉండేలా చూసుకోండి. వృత్తిఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించండి. చేపట్టిన పనుల్లో స్వల్ప ప్రగతి ఉంటుంది. శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. సూర్యారాధన మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): కార్యసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగపరంగా శుభప్రదం. సమయానికి పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆర్థికంగానూ బాగుంటుంది. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మాట పొదుపు పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరుచూ నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం): సాధారణ గ్రహయోగం. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధను కొనసాగించండి. విద్యార్థులకు పట్టుదల అవసరం. ఇష్టదేవతారాధన శుభఫలితాలనిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు): మిశ్రమ గ్రహబలం. సమస్యలు ఎదురైనా పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు. వస్తు వాహన సదుపాయాలు. సంతానపరంగా చిన్నపాటి చిరాకులు.ఆత్మీయులతో విభేదాలు వద్దు. కలహాలు రాకుండా చూసుకోండి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. నవగ్రహారాధన – ప్రదక్షిణలతో మేలు కలుగుతుంది.

కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు): సామాన్య గ్రహబలం. చిన్న పనైనా సరే సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయించండి. ఉద్యోగపరంగా పైఅధికారులతో సంయమనం అవసరం. అప్పులు చేయాల్సి రావచ్చు. కొత్త పనులు – ముఖ్యమైన ప్రయాణాలు కొంతకాలం వాయిదా వేసుకోండి. అన్ని విషయాల్లో ఓర్పు అవసరం. గురుధ్యానం మేలు చేస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శుభఫలితాలున్నాయి. వృత్తిఉద్యోగవ్యాపారాల్లో అభివృద్ధికి ఆస్కారం లభిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. కుటుంబసభ్యుల పరిపూర్ణ సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు శుభకాలం. తరుచూ ఆలయ దర్శనం చేయండి.

Share this post with your friends
Exit mobile version