Site icon Bhakthi TV

నచికేతుడికి మూడు వరాలిచ్చిన యముడు

ధర్మరాజ దశమి నాడు నచికేతుడి కథ వింటే మరణ భయం ఉండదట. దీనిలో భాగంగా కొంతమేర కథ తెలుసుకున్నాం కదా.. ఇప్పుుడ మిగిలిన కథ తెలుసుకుందాం. నచికేతుడు విసిగించడంతో యముడికి ఇచ్చేస్తానని తండ్రి వాజశ్రవుడు చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న వాజశ్రవుడు తొందరపాటులో అన్నానని తన మాటలు పట్టించుకోవద్దని చెప్పాడు. అయినా సరే.. వినని నచికేతుడు.. యముడి దగ్గరకు వెళ్లాడు. అప్పుడు యముడు మీ నాన్న మాటవరుసకు అంటే నువ్వు నిజంగానే వచ్చేశావా.. ఇంటికి వెళ్లు.. నేను నీకు మూడు వరాలు ఇస్తానని చెప్పాడు. నచికేతుడు ఆ మూడు వరాలు ఏం కోరుకున్నాడంటే..

మొదటి వరం: నేను తిరిగి వెళ్తే మా నాన్న నాపై కోప్పడకూడదు
రెండో వరం: స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞం చెప్పండి.
మూడో వరం: మరణం తరువాత ఏమి జరుగుతుంది? అని అడిగాడు. తొలి రెండు వరాలకు అంగీకరించిన యముడు.. మూడో వరానికి నచికేతుడు చిన్న పిల్లాడు కాబట్టి ఇప్పుడే అవన్నీ అవసరం లేదని చెబుతాడు. అయినా నచికేతుడు మొండిపట్టు పట్టడంతో యముడు అతనికి బ్రహ్మజ్ఞానం భోదించాడు. ఇదీ కథ. ఈ కథను ధర్మరాజ దశమి రోజు విన్న వారికి మరణ భయం ఉండదట.

Share this post with your friends
Exit mobile version