నీలం శివలింగం: నీలం రంగు అనేది భక్తికి, సత్యానికి చిహ్నం. శివుడిని నీలకంఠుడు అని కూడా అంటారు. ఈ నీలం రంగు శివలింగాన్ని పూజిస్తే.. ఇది నిజాయితీని, విశ్వాసాన్ని తీసుకురావడమే కాకుండా.. మన భావాలను బాగా వ్యక్తం చేయడానికి సహాయపడుతుందట. ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ప్రశాంతమైన, దృష్టి కేంద్రీకరించిన మనస్సును కూడా ఇస్తుంది.
బంగారు లేదా పసుపు శివలింగం: పసుపు వర్ణమనేది తెలివితేటలు, మంచికి చిహ్నం. బంగారం లేదంటే పసుపు శివలింగం.. సంపదను, సమృద్ధిని తీసుకురావడంతో పాటు.. వృత్తిలో లేదంటే చదువులలో పురోగతి కోరుకునే వారు.. ఏ పనిలో అయినా బలమైన శక్తిని, ఆత్మవిశ్వాసం, ప్రేరణ కోరుకునే వారు ఈ రంగు శివలింగాన్ని ఎంచుకుంటారు.
స్ఫటిక శివలింగం: స్ఫటిక శివలింగం అనేది చాలా శుభప్రదం. ఇది పరిశుభ్రత, తేలికపాటి శక్తిని ఇస్తుంది. ఇది ఉన్న ప్రాంతమంతా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది.
ఈ రంగు శివలింగం.. ఆశీర్వాదాలు, సామరస్యం, దైవిక రక్షణను ఇస్తుందట. స్పటిక శివలింగాన్ని పూజారులు.. అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటిగా భావిస్తారు.
ప్రతి రంగు కూడా ఒక సొంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏది ఉత్తమమైనదనేది మనం కోరుకునే ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా స్ఫటిక శివలింగాన్ని స్వచ్ఛమైనదిగానూ.. నలుపు శివలింగం అత్యంత శక్తివంతమైనదిగానూ.. తెలుపు శివలింగం అత్యంత శాంతియుతమైనదిగానూ భావిస్తూ ఉంటారు.
