Site icon Bhakthi TV

కార్తీకమాసంలో నదీ స్నానం ఎందుకు ఆచరించాలంటే..

కార్తీకమాసంలో నెల రోజుల పాటు అననీ పర్వదినాలే. ఈ మాసం శుభకార్యాలకు చాలా మంచిది. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదని చెబుతారు. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం అన్నీ కూడా విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ఈ నెలంతా శివ నామ స్మరణ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కార్తీక సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది.

కార్తీక మాసంలో ఏం చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. అర్చనలు, అభిషేకాలతో పాటు నదీ స్నాన, దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవిగా పేర్కొంటారు. అలాగే ఉపవాసం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో చేస్తే చాలా మంచిదని చెబుతారు. కార్తీకమాసంలో నదీ స్నానం ఎందుకంటే.. శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ ఈ మాసంలో నివసిస్తాడని నమ్మకం. ఈ మాసంలో నదీ స్నానం కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించాలి.

Share this post with your friends
Exit mobile version