Site icon Bhakthi TV

ధన్వంతరి మంత్ర జపం ఎందుకు వినాలి?

మన పూర్వీకులు ఆరోగ్యం కోసం చేసే మొదటి సాధన ధన్వంతరి ఆరాధనే. ఆయుర్వేదానికి ఆరాధ్యదేవుడు, దివ్య వైద్యుడు – శ్రీ ధన్వంతరి స్వామి. ఆయన కృప దృష్టి పడితే శరీరం బలంగా, మనస్సు ప్రశాంతంగా, జీవితం దీర్ఘాయుష్షుతో నిండిపోతుంది. కాబట్టి ధన్వంతరి మత్రం జపం చేయలేని వారు.. విన్నా కూడా సరిపోతుంది. అసలు ధన్వంతరి మంత్ర జపం ఎందుకు వినాలి? అనేది తెలుసుకుందాం.

ధన్వంతరి మంత్ర జపం ఎందుకు వినాలి?

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.

ఆందోళన, ఒత్తిడి తొలగి, మానసిక శాంతి లభిస్తుంది.

శరీర–మనస్సు సమతుల్యత పెంపొందుతుంది.

రోజువారీ ఆరోగ్య సాధన, ధ్యానం, ఆయుర్వేద ఆచరణలకు అనువైనది.

అనారోగ్య సమయంలో లేదా కోలుకునే దశలో తప్పక వినాలి.

ప్రతిరోజూ వినడం ద్వారా దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

మనసు పవిత్రంగా ఉంటేనే మంత్ర ఫలితం ఎక్కువ. భక్తి, నమ్మకం కలిస్తే వైద్యానికి మించిన ఔషధం అదే.

ధన్వంతరి మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ.

Share this post with your friends
Exit mobile version