Site icon Bhakthi TV

కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం ఎందుకంత ధృడంగా ఉందంటే..

భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు ‘తూర్పు-పశ్చిమ’ దిశలో ఉంటాయి. కేదార్‌నాథ్ ఆలయం మాత్రం ‘ఉత్తర-దక్షిణ’గా నిర్మించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆలయం ‘తూర్పు-పశ్చిమం’గా ఉండి ఉంటే.. అది ఇప్పటికే ధ్వంసమై ఉండేది. కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా శిథిలమై ఉండేది. కానీ ఈ దిశలో నిర్మించిన కారణంగా కేదార్‌నాథ్ ఆలయం బయటపడింది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది. విశేషమేమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు. అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారనేదే ఆసక్తికరం.

అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకు వెళ్లేందుకు కనీసం ఎలాంటి రవాణా సాధనాలు కూడా అందుబాటులో లేవు. ఈ రాయి లక్షణమేంటంటే.. 400 సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ, దాని గుణాలలో ఎటువంటి మార్పూ ఉండదు. ఎలాంటి ప్రకృతి విపత్తు ఎదురైనా కూడా ఆలయం తట్టుకుని నిలబడుతుంది. గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా ‘ఆష్లర్’ పద్ధతిలో అతికించారు. అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది. 2013లో వీట ఘలై గుండా గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండ రాయి (భీమ శిల) కూరుకుపోయింది. నీటి అంచుని విభజించి ఆలయానికి ఇరువైపులా ఉన్న నీరు దానితో పాటు అన్నింటిని మోసుకెళ్లింది. ఆలయంలో ఆశ్రయం పొందిన భక్తులు చాలా సురక్షితంగా ఉన్నారు. మరుసటి రోజు భారత వైమానిక దళం వారిని కాపాడింది.

Share this post with your friends
Exit mobile version