Site icon Bhakthi TV

మైసూర్‌లో దసరా ఎందుకంత ప్రత్యేకం?

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూర్ దసరా ఎప్పుడు ప్రారంభమవుతుంది? తేదీలు, సమయం అన్నీటి గురించి తెలుసుకున్నాం. అసలు దసరా చరిత్రేంటో తెలుసుకుందాం. మైసూర్ దసరా చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నిర్వహించే దసరా పండుగకు 4 వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దాదాపు14వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ పండుగ సాధారణంగా సెప్టెంబర్ చివరలో లేదా అక్టోబర్‌ మాసంలో వస్తుంది. దుర్గాదేవిని పది రోజుల పాటు కొలుస్తారు. మైసూర్ దసరా ‘రాష్ట్ర పండగ’గా ప్రసిద్ధి చెందింది. మైసూర్ రాజ కుటుంబం తమ ప్యాలెస్‌లో జరుపుకుంటూ ఉంటుంది.

అక్టోబర్ 3న సాయంత్రం ప్రైవేటుగా దసరా వేడుకలు మైసూర్ రాజకుటుంబం నిర్వహించే వేడుకతో ప్రారంభం కానున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. దుర్గామాత మహిషాసురడనే రాక్షసుడిని వధించిన రోజున దసరాను జరుపుకుంటారు. మహిషాసురమర్దిని కాబట్టే నగరానికి మైసూర్ అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ సంప్రదాయబద్దంగా జరిగే దశమి వేడుకలతో పాటు ప్రధాన ఊరేగింపు వాటన్నింటికీ మైసూర్ రాజు నేతృత్వంలో జరుగుతూ ఉంటాయి. మైసూర్ సంప్రదాయం ప్రకారం.. రాష్ట్రం మంచి కోసం యోధులు పోరాడుతున్నట్టుగా భావిస్తారు.

Share this post with your friends
Exit mobile version