Site icon Bhakthi TV

అశోకాష్టమిని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న పౌరాణిక కథేంటి?

అశోకాష్టమికి అసలు ఎందుకు జరుపుకుంటాం అనే దానికి సంబంధించి చాలా ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం రావణాసురునికి శక్తి దేవత అనుగ్రహం ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాముడికి రావణ సంహారం కష్టమై పోతుంది. అప్పుడు రావణాసురుని తమ్ముడు విభీషణుడు సలహా మేరకు రాముల వారు శక్తిని ప్రార్ధించేందుకు భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయానికి వచ్చాడట. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి 7 రోజుల పాటు శక్తిని, శివుడిని పూజించి వారి అనుగ్రహాన్ని పొందాడట.

శ్రీరాముడు 7 రోజుల పాటు పూజలు చేసిన మీదట శక్తి దేవత రామునికి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించిందట. దాంతో రావణుడిని సంహరించమని ఆదేశించింది. అలా శక్తి అనుగ్రహంతో శ్రీరాముడు రావణ సంహారం గావించాడని చెబుతారు. శ్రీరామునికి శక్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించింది అశోకాష్టమి రోజునేనని చెబుతారు. కాబట్టి శ్రీరాముడి విజయానికి చిహ్నంగా, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక తదుపరి రోజున శ్రీరామనవమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Share this post with your friends
Exit mobile version