Site icon Bhakthi TV

భార్య కోసం భర్త ఎందుకు నోము నోచుకోరు?

శివుడు ఉపదేశించిన వ్రతాన్ని ఇప్పుడు మహిళలంతా ఆచరిస్తున్నారని చెప్పుకున్నాం కదా. పిల్లల కోసమో లేదంటే భర్త క్షేమం కోసమో.. అదీ కాదంటే భర్త ఆరోగ్యం, పదోన్నతి, సంతానం, యోగ క్షేమాల కోసం వ్రతాలు చేస్తూ ఉంటారు. తమ కోసం మాత్రం మహిళలు ఒక్కటంటే ఒక్క వ్రతం కూడా చేయరు.

విచిత్రమేమిటో కానీ భార్య క్షేమం కోసం భర్త చేసే వ్రతం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. దానికి కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం భర్త చేసే ఏ ధర్మ కార్యం లేదంటూ పుణ్య కార్యంలో అయినా భార్యలకు సగం చెందుతుంది.

చివరకు భర్త ఇంట్లో నిత్యపూజ చేసినా కూడా అందులో సగం భార్యకు చెందుతుంది. అయితే మరి భర్త పాపం చేస్తేనో.. అది మాత్రం భార్యకు వాటా ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే.. మహిళలకు పుట్టుకతోనే ఓర్పు ఎక్కువ. అందుకే ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నోములు, వ్రతాలు అంటే కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసాలు చేయాలి. అలా చేయగల సహనం మహిళలకు మాత్రమే ఉంటుందని చెబుతారు. తన కోసం ఏ ఒక్క నోము, వ్రతాన్ని నోచుకోనందుకుగాను.. భర్త చేసే పుణ్యంలో సగ భాగం భార్యకు చెందేలా హిందూ ధర్మశాస్త్రం కల్పించింది.

Share this post with your friends
Exit mobile version