Site icon Bhakthi TV

మహిళకు నుదుట కుంకుమ, మంగళసూత్రం ఎందుకు?

హిందూ సంప్రదాయంలో మహిళలకు కట్టు, బొట్టు అనేది కొన్ని చిన్నప్పటి నుంచే ఉంటుంది. కాలి మెట్టెలు వంటివి వివాహానంతరం నుంచి వస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో వీటన్నింటినీ తీసి పక్కన పడేయడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆరోగ్యం రహస్యం కూడా దాగి ఉంటుందని మీకు తెలుసా? స్త్రీ అలంకరణలో భాగంగా నుదుట కుంకుమ, మంగళసూత్రం, గాజులు, కాలి మెట్టెలు, తలలో పువ్వులు చాలా ముఖ్యం ఈ ఐదు అలంకారాలున్న మహిళను ముత్తైదువగా సంబోధిస్తారు. ఆమెకు ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. మరి వీటి వలన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

నుదుట కుంకుమ…

అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అందుకే బొట్టుకి అంత ప్రాధాన్యత ఇస్తారు.

మంగళసూత్రం….

మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటివల్ల చర్మ వ్యాధులు రావు. క్యాన్సర్ కి బంగారం ట్రీట్మెంట్‌గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది కూడా.

Share this post with your friends
Exit mobile version