Site icon Bhakthi TV

వివాహంలో వధూవరులకు పారాణిని ఎందుకు రాసుకుంటారు?

హిందూ సంప్రదాయంలో తప్పనిసరిగా వివాహం అంటే వధూవరులకు పారాణి పూస్తారు. అసలెందుకు ఈ ఆచారం వచ్చింది. ఈ పారాణి రాయడం వెనుక అర్థమేంటి? తెలుసుకుందాం. పారాణి స్వచ్ఛత, శ్రేయస్సు, శుభాలను సూచిస్తుందని చెబుతారు కాబట్టి ఇదొక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా ఎరుపు రంగు స్త్రీ వైవాహిక స్థితికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాకుండా మతపరమైన వేడుకలు, వివాహాలు, పండుగల సమయంలో పారాణిని రాసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇది స్త్రీ దైవిక శక్తికి, స్వచ్ఛతకు చిహ్నమని చెబుతారు. అలాగే ఈ పారాణి పూయడమనేది ఆ సందర్భానికి సంబంధించిన పవిత్రతను మరింత పెంచుతుందట.

తెలుగు వివాహాలలో పసుపు, కుంకుమలు ఎంత సర్వసాధారణమో.. మెహందీ, పారాణి వంటివి కూడా అంతే సాధారణం, సంప్రదాయం. పెళ్లికొడుకు, పెళ్లికూతురు అలంకరణలో పారాణి రాయడమేది కీలకం. జీవితంలోని కొత్త దశను ఈ పారాణి సూచిస్తుందట. పారాణితో వధువు అత్తవారంట అడుగు పెడితే.. ఆమె తొలి అడుగులు ఎరుపు శ్రేయస్సు, ఆశీర్వాదాలకు సూచన అని చెబుతారు. పారాణి సంప్రదాయం అనేది మహాభారత కాలం నుంచి ఉంది. శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ల చిత్ర పటాలను పరిశీలించిన కానీ ఈ పారాణిని మనం గమనించవచ్చు. పారాణి అనేది మన మతపరమైన, సాంస్కృతిక ప్రాధాన్యతను సూచిస్తుంది.

Share this post with your friends
Exit mobile version