
శర్కరామయలింగం : సుఖప్రదం కొసం పూజిస్తారు .
సద్యోత్థలింగం : ప్రీతిని కలిగిస్తుందని పూజిస్తారు .
వంశాకురమయలింగం : వంశావృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
కేశాస్థిలింగం : వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
పిష్టమయలింగం : ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
దధిదుగ్థలింగం : కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
ఫలోత్థలింగం : ఫలప్రదమైనది చేపట్టిన కార్యంలో ఫలితాన్ని ఇస్తుంది .
ధాత్రిఫలజాతలింగం : ముక్తిప్రదం కలగడానికి పూజిస్తారు .
నవనీతలింగం : వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
దుర్వాకాండజలింగం : గరికతో తయారు చేసిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
కర్పూరజ లింగం : ముక్తిప్రదమైనది ముక్తిని ప్రసాదిస్తుంది.
ముక్తాలింగం : ముత్యంతో తయారుచేయబడిన లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
సువర్ణనిర్మిత లింగం : బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది వ్యాపారాభివృద్ధి కలుగుతుంది .
రజత లింగం : సంపదలను కలిగిస్తుంది.
ఇత్తడి-కంచులింగం : ముక్తిని ప్రసాదిస్తుంది.
ఇనుము-సీసపులింగం : శత్రునాశనం చేస్తుంది.
అష్టథాతులింగం : చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
వెైఢూర్యలింగం : శత్రునాశనం. దృష్టిదోషహరం.
స్ఫటికలింగం : సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
సితాఖండలింగం : పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.
ఇక శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉన్నాయి.
శుద్ధలింగమూర్తులు,
లింగోద్భవమూర్తులు .
శుద్ధలింగమూర్తులు : ఇవి సహజంగా ఏర్పడిన లింగాలు, లేదా మనిషి స్వయంగా తయారు చేసిన లింగాలు. ఇవి సాధారణంగా రాతితో, లేదా ఇతర పదార్థాలతో చేయబడతాయి. శివలింగంలో ఇవి ప్రాథమిక రూపంగా పరిగణించబడతాయి.
లింగోద్భవమూర్తులు :
ఇవి లింగం నుంచి ఉద్భవించి నట్లుగా భావించబడే మూర్తులు. ఇవి సాధారణంగా లింగం నుండి పొడుచుకువచ్చినట్లుగా లేదా ఏదైనా ఇతర రూపంలో ఉద్భవించినట్లుగా ఉంటాయి.
