Site icon Bhakthi TV

నల్లదారాన్ని ఎందుకు ధరిస్తారు? ఎవరు ధరించాలి?

ఇటీవలి కాలంలో చాలా మంది కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం చూస్తున్నాం. అసలెందుకు అలా కట్టుకుంటారు? స్టైల్ కోసమా? మరో కారణమేమైనా ఉందా? అంటే జ్యోతిష్య కారణాలతో చాలామంది నల్లదారం కట్టుకుంటారు. నల్ల దుస్తులను ధరిస్తే చెడు జరుగుతుందన్న కారణంతో ధరించడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే నల్లదారం కూడా అందరికీ సెట్ కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నల్లదారాన్ని అందరూ కట్టుకోకూడదట. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. అలా కాదని ఎవరు పడితే వాళ్లు కట్టుకుంటే జీవితంలో వృద్ధి మాటేమో కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఖాయమట.

నలుపు రంగు అనేది శనీశ్వరుడికి ప్రతీక అని తెలిసిందే. అందుకే ఈ నల్లదారాన్ని ధరించే వారు ముందుగా శనిదేవునికి నమస్కరించి కట్టుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు కూడా కట్టుకోకూడదు. ఒక ప్రత్యేకమైన రోజున దీనిని కట్టుకోవాలి. ఈ దారాన్ని ధరించడం ద్వారా ఆ శనిశ్వరుని అనుగ్రహం కలిగి శని నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అయితే నల్లదారాన్ని ధరించాక ఓ పని చేయాలట. అదేంటంటే గాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఈ నల్లదారాలను స్త్రీలు అయితే ఎడమకాలికి, పురుషులైతే కుడి కాలికి ధరించాలి. ఇలా ధరించడం వల్ల దుష్టశక్తుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది.

Share this post with your friends
Exit mobile version