Site icon Bhakthi TV

రథయాత్రకు ముందు బంగారు చీపురుతోనే ఎందుకు శుభ్రం చేస్తారు?

పూరి జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి ఎన్నో నమ్మలేని నిజాలున్నాయి. ఈ రథయాత్ర ప్రారంభానికి ముందు బంగారు చీపురుతో రథం ముందు ఊడుస్తారు. ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని ‘చేరా పహారా’గా పిలుస్తారు. దీని వెనుక లోతైన విశ్వాసం.. స్వచ్ఛత దాగి ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇలా శుభ్రం చేయడం అనేది ఎవరు పడితే వారు చేయరు. రాజులు, వారి వారసులు మాత్రమే చేస్తారు. ఈ సంప్రదాయంలో ఎవరుబడితే వారు బంగారు చీపురుతో శుభ్రం చేయలేరు. బంగారం అనేది అత్యంత విలువైన లోహం.

అంత విలువైనది కాబట్టే రథానికి ముందు శుభ్రం చేసేందుకు బంగారు చీపురును వాడతారు. వేద మంత్రాలు జిపించిన మీదట.. మూడు రథాల మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. భగవంతుడిని స్వాగతించేందుకు ఇది చిహ్నంగా పేర్కొంటారు. అలాగే ఈ సంప్రదాయం వెనుక మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. భగవంతుడు వెళ్లే మార్గం స్వచ్చంగా పరిశుభ్రంగా ఉండాలి. ఇలా చేయడమంటే నేరుగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవికి కృతజ్ఞత తెలియజేస్తారని నమ్మకం. అందుకే ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version