Site icon Bhakthi TV

భక్తులకు తిరునామధారణ ఎందుకు?

కలియుగ దైవం శ్రీనివాసుడిని చూడగానే మనసు ఆనందపారవశ్యంలో తేలి పోతుంది. ఇక తిరుమలలో అయితే శ్రీ వేంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడిగా కనిపిస్తాడు. వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను ధరించి గొప్పగా కనిపిస్తారు. అలాగే వివిధ రకాల పువ్వులతో చేసిన కదంబ మాలలను ధరించి.. నుదుటన తిరునామం ధరించిన స్వామివారిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అసలు తిరునామం విశిష్టత ఏంటి? తిరుమలకు వెళ్లిన భక్తులందరూ తిరునామం ధరిస్తూ ఉంటారు? కనీసం వారికి కూడా ఎందుకు ధరిస్తున్నామనేది తెలియదు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సనాతన ధర్మంలో తిరునామాన్ని సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతీకగా భావిస్తారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ కారణంగానే తిరునామాన్ని ధరిస్తాడు. తిరునామాన్ని ధరించడం దేవునిపై గల భక్తి, నమ్మకానికి సంకేతంగా భావిస్తారు. అలాగే అక్కడకు వెళ్లిన భక్తులను తిరునామం ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా తిరునామాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది. నిత్యం దీని కోసం రెండు షిఫ్టుల్లో 130 మంది శ్రీవారి సేవకులు పని చేస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version