Site icon Bhakthi TV

అంకోర్ వాట్ దేవాలయాన్ని ఎవరి కోసం నిర్మించారు?

కాంబోడియా రాజధాని నోమ్‌పెన్‌కు ఉత్తర-పడమర దిశలో సియం రీప్ నగరానికి దగ్గరగా అంకోర్ ప్రాంతంలో అద్భుత వైభవంగా హిందూ దేవాలయ సముదాయం విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయ సముదాయం ఇదే. దీని చారిత్రక ప్రాధాన్యత ఏంటంటే.. అంకోర్ వాట్ ఆలయం 12వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. ఇది కేవలం కాంబోడియా ప్రతీక మాత్రమే కాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. మొదట హిందూ దేవాలయంగా.. శ్రీమహావిష్ణువు కోసం నిర్మించారు. ఈ ఆలయం, తర్వాత బౌద్ధ సంప్రదాయం ప్రభావంతో బౌద్ధ దేవాలయంగా మారింది.

ఈ ఆలయం చుట్టూ ఉన్న అద్భుత శిల్పాలు రామాయణం, మహాభారతం ఘట్టాలను చెబుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, మౌంట్ మెరు (దేవతల నివాస శిఖరం) ప్రతీకగా ఈ ఆలయం నిర్మించబడింది. మధ్యలోని గోపురం ప్రధాన శిఖరంగా, చుట్టూ నాలుగు గోపురాలు దిక్కులుగా ఉండటం విశేషం. ఈ ఆలయ నిర్మాణానికి సూర్యవర్మన్ II ఎంతగానో కృషి చేశారు. 1113–1150 మధ్య ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మహారాజు కాలంలో అంకోర్ వాట్ నిర్మాణం జరిగింది. ఆయన భక్తి, సామ్రాజ్య వైభవాలకు ప్రతిబింబంగా ఈ ఆలయం పుట్టింది.

Share this post with your friends
Exit mobile version