Site icon Bhakthi TV

తులా సంక్రాంతి సమయంలో ఎవరిని పూజించాలి?

తులా లేదంటే గర్భాన సంక్రాంతి గురించి తెలుసుకున్నాం. ప్రత్యేకంగా ఒడిశా, కర్ణాటకలలో తులా సంక్రమణాన్ని విశేషంగా జరుపుకుంటాం. తులా సంక్రమణం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదట. ముఖ్యంగా రైతులు లక్ష్మీదేవిని పూజించుకుంటే పంటలు బాగా పండుతాయట. తులా సంక్రాంతి నాడు రైతు కుటుంబాలు లక్ష్మీదేవికి కొన్ని ప్రాంతాల్లో గోధుమ ధాన్యాలు, కూరగాయల మొక్కల కొమ్మలు, తాజా వరి ధాన్యాలు, తాటి కాయలు, పసుపు, కుంకుమ, గంధం, గాజులు లాంటి మంగళ ద్రవ్యాలను సమర్పించి పంటలు బాగా పండాలని కోరుకుంటారు.

ముఖ్యంగా తులా సంక్రమణాన్ని ఒడిశా, కర్ణాటకలలో జరుపుకుంటారు. అక్కడ ఒక కొబ్బరికాయను పట్టు వస్త్రంలో చుట్టి దానిని గౌరీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఒడిశాలో ఈ రోజున ధాన్య రాశులను కొలుస్తారు. ఇలా చేస్తే ధన, ధాన్యాలకు లోటుందని అక్కడి వారి నమ్మకం. అలాగే లక్ష్మీనారాయణుల, శివపార్వతుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తులా సంక్రమణం నాడు బ్రాహ్మణులకు సైతం కూరగాయలు, పప్పు, బెల్లం వంటి వాటిని దానంగా ఇస్తారు. ఇలా చేస్తే చాలా మంచిదట.

Share this post with your friends
Exit mobile version