Site icon Bhakthi TV

విఠలుడని ఎవరిని అంటారు? ఎందుకు?

త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయకారకులుగా పేర్కొంటారు. ముఖ్యంగా విష్ణుమూర్తిని విశ్వానికి రక్షకుడిగా చెబుతారు. అందుకే విష్ణుమూర్తి అవతారాలను భక్తులు విశేషంగా పూజించుకుంటారు. మరి విష్ణుమూర్తి అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? అంటే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగయుగాలలో లోక పాలన కోసం, ధర్మ సంస్థాపన కోసం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తాడట. ఈ అవతారాల్లో దశావతారాలు ముఖ్యం కాగా.. వాటిలో విఠలుడి అవతారం ఒకటి. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అంశగా విఠలుడిని భావిస్తారు.

మరి మనం విఠలుడని పిలవం కదా.. మరెక్కడ పిలుస్తారు అంటారా? మహారాష్ట్రలో పిలుస్తారు. విఠల స్వామి ఆలయాలు దేశ వ్యాప్తంగా చాలా ఉన్నాయి. అసలు శ్రీకృష్ణుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒక భక్తుడి పేరు మీదుగా వచ్చిందట. సదరు భక్తుడు శ్రీకృష్ణుడికి ఒక ఇటుకను విసిరి దానిపై ఆయనను నిలబడమని కోరాడట. దానిపై భక్తుడు సంతోషకర భంగిమలో రెండు చేతులు నడుముపై ఉంచి ఇటుకపై నిలబడి పోయాడట. అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి విఠలుడు అనే పేరు వచ్చింది.

Share this post with your friends
Exit mobile version