
శ్రావణ మాసంలో ఉత్తరాది వారు శివయ్యను పూజించుకుంటారు. ఇక శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఈ నెల రోజుల పాటు నిత్యం శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక కన్వర్ యాత్రను సైతం నెల మొత్తం చేస్తారు. కన్వర్ యాత్ర ప్రస్తావన శివ పురాణంలో, లింగ పురాణంలో కూడాఉంది. ఈ నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. కాలి నడకన భక్తులంతా కావిళ్లతో జలాన్ని మోసుకుంటూ కాశీ, హరిద్వార్, రిషికేష్ కూడా వెళుతుంటారు.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం చూస్తే.. ఈ కన్వర్ యాత్రను తొలిసారిగా పరశురాముడు ప్రారంభించాడు. ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి పరశురాముడు కాలి నడకన కావిళ్లతో గంగాజలాన్ని తీసుకొచ్చాడట. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ సమీపంలో పరశురాముడు ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలి నడకన కావిళ్ళతో నుంచి గంగాజలాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు తీసుకువచ్చాడట. బాగ్‌పత్ సమీపంలో ఉన్న ‘పుర మహాదేవుడి’ని అభిషేకించాడట. అప్పటి నుంచి కన్వర్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు అంటారు.
