Site icon Bhakthi TV

ఇంట్లో ఏ మొక్కలుండాలి? ఏవి ఉండకూడదు?

ఇంట్లో అందం కోసమో.. అలంకారం కోసమో చాలా మంది మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ప్రస్తుత తరుణంలో ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చాయి. అయితే ఇంటి లోపల పెంచుకునే మొక్కల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. పెంచితే లేనిపోని సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం. మొదటిగా కాక్టస్‌ మొక్క.దీనిని తెలుగులో బ్రహ్మజముడు అని కూడా ఉంటారు. ఇదొక ఎడారి మొక్క. ఇప్పుడు దీనిని ఇళ్లలోనూ పెంచుతున్నారు. దీనిని ఇంట్లో పెంచడం ఏమాత్రం మంచిది కాదట. నెగిటివిటీ పెరుగుతుందని చెబుతారు.

అలాగే చింత మొక్కను ఎవరూ సాధారణంగా ఇంట్లో పెంచుకోరు. ఇది ఉంటే ఇంట్లో అశాంతి, గొడవలు వస్తాయని చెబుతారు. కాబట్టి ఇంట్లో ఉంటే తీసేయడం ఉత్తమం. ఇక ఇంట్లో ఏ మొక్కలు పెంచుకుంటే మంచిదో తెలుసుకుందాం. మనీ ప్లాంట్‌, బాంబో ప్లాంట్స్‌ను ఇంట్లో పెంచుకుంటే మంచిదట. ఈ విషయాన్ని వాస్తు శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. ఈ రెండు మొక్కలను ఇంట్లో ఈశాన్యం మూలన ఉంటే చాలా మంచిదట. ఇంట్లో ఈ మొక్కల కారణంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. తీసేయాల్సిన మొక్కలను తీసేసి.. ఇంట్లో ఉంచాల్సిన మొక్కలను ఉంచితే అంతా మంచే జరుగుతుంది.

Share this post with your friends
Exit mobile version