Site icon Bhakthi TV

ఏ శంఖాన్ని ఇంట్లోని పూజ గదిలో ఉంచుకోవాలి?

శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,దానికే పాంచజన్యం అని పేరు. దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు.

దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజా విధానంలో వాడరు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి కూడా రావట.

వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట.

Share this post with your friends
Exit mobile version