Site icon Bhakthi TV

నెమలి ఈకలను మన ఇంట ఎక్కడ పెట్టుకోవాలంటే..

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో నెమలి ఈకకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నెమలి ఈకను ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదని అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడి కిరీటంలోనూ నెమలి ఈకలు కూడా కనిపిస్తాయి. కన్నయ్య దైవత్వం, సరళతకు నెమలి ఈకను నిదర్శనంగా పేర్కొంటారు. అయితే నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవాలంటే పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఇలా కొన్ని నియమానుసారంగా నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని నమ్మకం. ఇక ఆ వాస్తు నియమాలేంటో చూద్దాం.

నెమలి ఈకలను వాయువ్య దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని పిల్లల స్టడీ రూంలో పెడితే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతుందట. నెమలి ఈకలు ఇంట్లో వాస్తు దోషాలను సైతం తొలగిస్తాయట. ఆర్థిక ఇబ్బందులుంటే.. అవి తీరడానికి నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా డబ్బు పెట్టుకునే ప్రాంతంలో పెట్టుకుంటే సంపద పెరుగుతుందట. ఉత్తర దిశలో నెమలి ఈకలను ఉంచితే వ్యాపారంలో పురోగతి, లాభాల అవకాశాలు పెరుగుతాయి. అలాగే నెమలి ఈకలపై కుంకుమతో శ్రీ అనే పదం రాసి పూజా స్థలంలో పెడితే వాస్తు దోషాలను తొలగిస్తాయట.

Share this post with your friends
Exit mobile version