Site icon Bhakthi TV

గురు పౌర్ణమి నాడు ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాలంటే..

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. హిందువులు గురు పౌర్ణమికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ ఆషాఢ గురు పౌర్ణమి అనేది లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుకు అంకింతం చేయబడినదని నమ్ముతారు కాబట్టి వారివురినీ పూజిస్తారు. వీరివురిని పూజిస్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ.. ఇతర సమస్యలు కానీ ఉండవని నమ్ముతారు. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. గురు పౌర్ణమినాడు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారట. మరి నెయ్యి దీపాలను ఎలా వెలిగించాలి? తెలుసుకుందాం.

గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి శుచిగా స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే సాయంకాలం వేళ కూడా స్నానమాచరించి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున ఇక్కడ నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అలాగే రావి చెట్టు కింద దీపం వెలిగించినా కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట. వాస్తవానికి రావిచెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. అలాగూ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించినా కూడా నెగిటివిటీ అనేది ఇంట్లోకి రాదని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version