Site icon Bhakthi TV

శ్రీనివాసుడు కూర్చొన్న భంగిమలో ఎక్కడ దర్శనమిస్తాడంటే..

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు తిరుమల ఆనంద నిలయంలో అర్చావతారమూర్తిగా పూజలందుకుంటున్నాడు. శ్రీ మలయప్పస్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల శ్రీవారి ఆలయానికి వెళుతుంటారు. శ్రీనివాసుడి ఆలయాలు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. అయితే ప్రతి ఆలయంలోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారు నిలుచున్న భంగిమలోనే మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఓ ఆలయంలో మాత్రం శ్రీనివాసుడు కూర్చొన్న భంగిమలో దర్శనమిస్తాడు. అంతేకాదు.. ఈ ఆలయ విశేషం మరొకటి ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కల్యాణం కాని వారికి తప్పక కల్యాణం జరుగుతుందని నమ్మకం.

శ్రీనివాసుడు కూర్చొన్న భంగిమలో దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఆలయ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా తొండమానపురంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై సుఖాసన భంగిమంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. తొండమానపురంలోని ఈ ఆలయంలో శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుడు శంఖు చక్రాలు ధరించి, యోగ అభయ ముద్రలలో దర్శనమిస్తాడు. ఆలయ గోపురం అచ్చుగుద్దినట్టుగా తిరుమల ఆనందానిలయం విమానాన్ని పోలి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version