Site icon Bhakthi TV

కుబేర యంత్రాన్ని ఇంట్లో ఎక్కడ ప్రతిష్టించాలి?

ఈశాన్య దిశకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేక స్థానముంది. ఈ దిశను కుబేరుడి స్థానం భావిస్తుంటారు కాబట్టి దీనిని శుభ్రంగా ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలుండవని చెబుతారు. ధనం, సంపదలకు అధిపతి కుబేరుడు కాబట్టి ఆయనను మెప్పిస్తే ఆర్థిక సమస్యలుండవట. పూజగదిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదట. అలాగే ఈశాన్య దిశలో పొరపాటును కూడా బరువైన వస్తువులు పెట్టకూడదని చెబుతారు. ముఖ్యంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండకూడదంటే.. కుబేర యంత్రం ప్రతిష్టించాలని చెబుతారు.

అయితే కుబేర యంత్రాన్ని ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ప్రతిష్టించకూడదు. దీనికి పక్కాగా ఓ నియమం ఉంది. ఉత్తర దిశలో మాత్రమే ప్రతిష్టించాలి. అప్పుడు మాత్రమే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. కుబేరుడిని నిత్యం పూజించే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అయితే కుబేరుడిని యంత్ర రూపంలో మాత్రమే పూజించాలి. కుబేర యంత్రానికి నిత్యం దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెబుతారు. కొత్త ఇల్లు కట్టేటప్పుడు సైతం కుబేరుడి దిశను పరిగణలోకి తీసుకుని కట్టాలి. అలా చేస్తే ఆయన ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతారు.

Share this post with your friends
Exit mobile version