Site icon Bhakthi TV

విష్ణు పాదముద్రలు ఎక్కడ ఉన్నాయి? వాటిని చూస్తే ఏం జరుగుతుంది?

బీహార్‌లోని గయలో విష్ణుమూర్తి క్షేత్రం గురించి తెలుసుకున్నాం.. అలాగే ఈ ఆలయ స్థల చరిత్ర ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. ఇక్కడ శ్రీరాముడు, పాండవులు తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించారని చెప్పుకున్నాం. ఇప్పుడు గయంలో నిర్వహించే ఇతర ప్రత్యేక పవిత్ర స్థలాల గురించి కూడా తెలుసుకుందాం. గయ ప్రాంతంలో సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే పితృదేవతగా నివసిస్తున్నాడు. ఇక్కడ ఆయనను విష్ణుమూర్తిగా కాకుండా ‘గదాధరుడు’గా పూజిస్తారు. అంతేకాకుండా ఈ నేలపై శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్నాయట. అవి చూస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయని చెబుతారు.

హిందూ మతంలో పితృ ఋణాన్ని అతి ముఖ్యమైన రుణంగా పరిగణిస్తారు. కాబట్టి పిల్లలు తప్పని సరిగా పితృ రుణాన్నిచెల్లించాలని చెబుతారు. గయలో పిండ ప్రదానం చేస్తే.. 108 వంశాల పూర్వీకులు, 7 తరాల వరకు మోక్షం పొందుతారని నమ్మకం. గయలో పిండ ప్రదానం చేయాలనుకునేవారి కోసం మూడు ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా పిండ ప్రదానం చేయాలి. ఇక విష్ణుమూర్తి పాదముద్రలు వచ్చేసి విష్ణు పాద ఆలయంలో ఉంటాయి. పిండ ప్రదానం చేసిన అనంతరం ఫాల్గు నదిలో తర్పణం వదులుతారు. ఫాల్గు నది అదృశ్యంగా ప్రవహిస్తూ ఉంటుందట.
గయలోని క్షేత్రంలో అక్షయవత్ అనేది ఒక పురాతన మర్రి చెట్టు కింద పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకులకు శాశ్వత సంతృప్తి లభిస్తుందని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version