Site icon Bhakthi TV

దేశంలోని ప్రసిద్ధ శనీశ్వరాలయాలు ఎక్కడెక్కడున్నాయంటే..

ఢిల్లీలోని ఈ శనీశ్వరుడి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఢిల్లీలోని మరో ప్రసిద్ధ శనీశ్వరుడి ఆలయంతో పాటు దేశంలోని మరికొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం. ఢిల్లీలోని రోహిణి సెక్టార్-16లో ఓ శనీశ్వరుడి ఆలయం ఉంటుంది. ఈ శనీశ్వరుడి ఆలయానికి ప్రతి శనివారం ముఖ్యంగా శని జయంతి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ కూడా శనీశ్వరుడి విగ్రహం భారీగానే ఉంటుంది. ఇక్కడ శనిదోష నివారణ పూజలు ప్రతి శనివారం జరుగుతాయి. 27న శని జయంతి కాబట్టి ఆ రోజున ఒక గొప్ప శకటం, రుద్రాభిషేకం, లంగర్ నిర్వహిస్తారు.

హర్యానా ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ పురాతన ఆలయం చాలా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ పూజ నిర్వహిస్తే తప్పక శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శని జయంతి నాడు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు, పూజలను నిర్వహిస్తారు. ఇక్కడ నల్లని వస్తువులను దానం చేయడం, నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శని అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఘజియాబాద్‌లో ఉన్న ఆలయమైతే మరింత ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇక్కడ శని జయంతి నాడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. శని పథం, తైలాభిషేకం, భండారా పేరిట నిర్వహించే వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.

Share this post with your friends
Exit mobile version